మార్గమధ్యంలో ప్రసవం.. తల్లీబిడ్డ సురక్షితం
25-09-2026 | 05:58pm
కౌటాల, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): వేరవెల్లి గ్రామానికి(Veravelli village) చెందిన పి. అశ్విని(Ashwini) (25)కు మార్గమధ్యంలోనే ప్రసవం జరిగింది. శుక్రవారం వేరవెల్లి నుంచి కౌటాల వైపు వస్తుండగా ప్రసవం(Childbirth) కావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ సిబ్బందికి(Ambulance staff) సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఈఎంటీ ఎర్ర అజయ్‌కుమార్, పైలట్ పి. నరేష్ తల్లీబిడ్డను కౌటాల పీహెచ్‌సీకి(Koutala PHC) తరలించారు. సకాలంలో ఆస్పత్రికి చేర్చడంతో తల్లీబిడ్డ సురక్షితంగా ఉన్నారు. అత్యవసర సమయంలో సేవలందించిన 108 సిబ్బందిని అశ్విని కుటుంబ సభ్యులు అభినందించారు.