దామల్ల లచ్చమ్మ చిత్రపటానికి ఘన నివాళులు

30-10-2026 | 05:49pm

తోటి రిపోర్టర్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ

తిరుమలాయపాలెం అక్టోబర్ 30 (విజయ క్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని బీరోలు గ్రామంలో నమస్తే న్యూస్ రిపోర్టర్(Namaste News Reporter) మాతృమూర్తి దామల్ల లచ్చమ్మ కుటుంబ పరామర్శ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల రిపోర్టర్లు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై లచ్చమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాతృమూర్తిని కోల్పోయిన తోటి రిపోర్టర్‌ను పలువురు ఓదార్చి ధైర్యం చెప్పారు. తల్లి మరణం తీరని లోటని, ఆ బాధను మాటల్లో చెప్పలేమని పేర్కొన్నారు. కష్టకాలంలో కుటుంబ సభ్యులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జర్నలిస్టుల మధ్య ఐక్యత, పరస్పర సహకారం ఎంతో ముఖ్యమని తెలిపారు. లచ్చమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక రిపోర్టర్లు, ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ నాయకులు లచ్చమ్మ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు