నేల బారిన పడిన వరి పంటలను పరిశీలించిన అగ్రికల్చర్ అధికారి

04-11-2026 | 09:06pm

కూసుమంచి, నవంబర్ 4(విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని పెరిక సింగారం గ్రామంలో తుఫాను ప్రభావానికి దెబ్బతిన్న వరి పొలాలను మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి(Agricultural Officer Ramadugu Vani) సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పడిపోయిన పొలాల నుండి నీటిని తీసివేయాలని , పనలను నిలబెట్టి కట్టుకోవాలని సూచించారు.

గింజలు పూర్తిగా తయారై నీటిలో మునిగి ఉంటే మొలకెత్తే అవకాశం ఉంటుందని , దీనిని నివారించడానికి, ఐదు శాతం ఉప్పు ద్రావణం పిచికారి చేయాలనీ ,ఈ విధంగా చేయడం వల్ల గింజ మొలకెత్తకుండా ఉంటుందని రైతులకు సూచించారు. వర్షం తగ్గిన వెంటనే వరి పైరు పై ప్రాపికోనజోల్ మందును పిచికారి చేయడం వల్ల కాటుక తెగులు రాకుండా నివారించవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి నవీన్ మరియు  రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు