కోలేటి కృష్ణయ్య మృతికి మాజీ ఎమ్మెల్యే సండ్ర సంతాపం

09-10-2026 | 11:27pm

కల్లూరు, అక్టోబర్ 09 (విజయ క్రాంతి): కల్లూరు మండలం(Kallur Mandal) పాయపూరు గ్రామ సర్పంచ్ కోలేటి శ్రీనివాసరావు(Village Sarpanch Koleti Srinivasa Rao) తండ్రి కోలేటి కృష్ణయ్య (68) అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య(Sandra Venkata Veeraiah) ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు, బిఆర్ఎస్ నాయకులు దేవరపల్లి నాగప్రసాద్,తాళ్లూరి రమేష్, అడ్వకేట్ గోసు వీరభద్రం ,వాకధాని శ్రీనివాసరావు,దేవరపల్లి వెంకట్రావు,వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు