పేకాట స్థావరంపై పోలీసుల దాడి

30-10-2026 | 11:39pm

హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేశవపట్నం గ్రామంలో ఇంట్లో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించి ఐదుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.11,350 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేశవపట్నం గ్రామంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు.

ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న బొమ్మ ప్రవీణ్, తాటిపాముల మహేష్, జక్కుల కుమార్, గోపగోని బసవయ్య (గద్దపాక గ్రామం), ములుగూరి సదానందం (కేశవపట్నం గ్రామం)లను పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలు, పేక ముక్కలను స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఏఎస్ఐ సంపత్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు