మట్టి వినాయకులనే పూజిద్దాం

12-09-2026 | 06:09pm

ముకరంపుర,(విజయ క్రాంతి): వినాయక పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణ(Environmental protection) కోసం కరీంనగర్ కార్పొరేషన్ 23వ డివిజన్ కార్పొరేటర్ గుమ్మడి రాజకుమార్ ఆధ్వర్యంలో స్థానిక కార్పొరేటర్ కార్యాలయంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ(Distribution of free clay ganesha idols) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని కార్పొరేటర్ గుమ్మడి రాజ్ కుమార్(Corporator Gummadi Raj Kumar) చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక భక్తి అనేది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో మరియు మానసిక ప్రశాంతతను చేకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన విగ్రహాలను పూజించడం వల్ల తీవ్రమైన జల కాలుష్యం మరియు దీర్ఘకాలిక పర్యావరణ నష్టం జరుగుతుంది. మట్టి విగ్రహాలను ఎంచుకోవడం ద్వారా మనం మన ఆధ్యాత్మిక బాధ్యతను నెరవేర్చడంతో పాటు, భవిష్యత్ తరాల కోసం సహజ వనరులను కాపాడే బాధ్యతగల పౌరులుగా ఉంటామని అన్నారు. పర్యావరణ పరిరక్షణపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రతి ఏటా ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం తమ ప్రధాన కర్తవ్యం అని కార్పొరేటర్ గుమ్మడి రాజకుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు