విషాద సమయంలో బాధితులకు అండ
టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
కామారెడ్డి, నవంబర్ 4 (విజయక్రాంతి): కుటుంబంలో ఆప్తులను కోల్పోయి విషాదంలో ఉన్న సమయంలో బాధిత కుటుంబాలకు అండగ ఉంటామని టిపిసిసి ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి(Gaddam Chandrashekhar Reddy) అన్నారు. బుధవారం కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో(Congress Party Office) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు విషాద సమయంలో ఉచిత భోజన సేవను ప్రారంభించారు. అబ్దుల్ అంతేకదా సమయంలో ఇంటికి వచ్చే బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు ఆదరణపు భారం కాకుండా భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఈ సేవ అవసరమైన కుటుంబాలు జిఎస్సార్ ట్రస్ట్ కు సమాచారం అందిస్తే అన్నపూర్ణ సేవారతం ద్వారా ఉచితంగా భోజనాన్ని వారి ఇంటి వద్దకు తీసుకువచ్చి అందించనున్నట్లు తెలిపారు.
కష్ట సమయంలో కుటుంబాలకు అండగా నిలవడం వారి ఇబ్బందులను కొంతవరకు తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. ఈ సేవను అవసరమైన ప్రతి కుటుంబం వినియోగించుకోవచ్చని తెలిపారు. అవసరమైన వారు సెల్ నెంబర్ 95360 00333 నువ్వు సంప్రదించాలని సూచించారు.
ఈ సేవా కార్యక్రమం గురించి ఇతరులకు కూడా తెలియజేసి అవసరమైన వారికి సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా, జిల్లా కాంగ్రెస్ సేవల అధ్యక్షులు మున్సిపల్ కౌన్సిలర్ గడ్డమీద మహేష్, తాటి ప్రసాద్,
డిసిసి ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్ చింతల రవీందర్ గౌడ్, జమీల్ అహ్మద్, సేవాలాల్ నియోజకవర్గ అధ్యక్షులు మెహర్ బాబా గౌడ్, రంగ రమేష్ గౌడ్, చాట్ల వంశీ, మాధవి, శ్రీధర్ రావు, బండారి శ్రీకాంత్, అరవింద్, ఆబిద్, కామారెడ్డి మండల సేవాదాల అధ్యక్షులు హరీష్, వేణు, ప్రణీత్, రాహుల్, శశి, పండు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.