ఎస్పీ రాజేష్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీరామ్ వెంకటేష్

03-11-2026 | 02:45pm

భిక్కనూర్, నవంబర్ 3 (విజయ క్రాంతి): నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(National Human Rights and Anti-Corruption Council of India) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ మంగళవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేసి సంస్థ కార్యకలాపాలపై చర్చించారు.

మానవ హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం, బాధితులకు అండగా నిలవడం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. ప్రజల నమ్మకాన్ని పొందుతూ సంస్థకు మంచి గుర్తింపు తీసుకురావాలని తెలిపారు. ఎస్పీ సూచనల మేరకు ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తానని శ్రీరామ్ వెంకటేష్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు