బియ్యం అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించాలి
బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కొత్తగూడెం టౌన్, నవంబర్ 3 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లోని శ్రీజ ఇండస్ట్రీస్ లో(Sreeja Industries) జరిగిన బియ్యం అక్రమలపై సమగ్ర విచారణ నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
మంగళవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 175 మీటర్లు బియ్యం లో సుమారు 42 మీటర్ల బియ్యాన్ని పక్కదారి పట్టించి, సుమారు రూ 6 .90 కోట్ల ప్రజాదానానికి సంబంధించి నా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. శ్రీజ ఇండస్ట్రీస్ అధినేత ఆళ్ల మురళీకృష్ణ అందుకు బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
జిల్లా మంత్రికి ముఖ్య అనుచరుడుగా చెప్పబడుతున్న ఆ వ్యక్తి ప్రజలకు చేరవలసిన బియ్యాన్ని అక్రమ మార్గంలో బ్లాక్ మార్కెట్లో విక్రయించినట్లు ఆరోపణలు రావడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని విమర్శించారు. ఈ వ్యవహారంపై పోలీసులను వివరణ కోరగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీలను బహిర్గతం చేయకపోవడం శోచనీయమన్నారు.
అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసు వ్యవస్థ తలగందానే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. కేవలం 2025-2026 ఆర్థిక సంవత్సరంలోనే ప్రజలకు చేరవలసిన, ప్రభుత్వం తిరిగి పొందవలసిన బియ్యాన్ని పక్కదారి పట్టించి బ్లాక్ మార్కెట్లో విక్రయించినట్లు ఆయన ఆరోపించారు. ప్రజాపక్షమని, ప్రజల కోసమే తమ పాలన అని చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కార్యదర్శి ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఎందుకు స్పందించకపోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్, సిబిఐ ద్వారా సమగ్ర విచారణ నిర్వహించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు రాకేష్ బాబు, ఎస్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మంగీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.