పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు

03-11-2026 | 03:27pm

పంట వ్యర్థాలను కాల్చకుండా భద్రం. 

బోథ్. నవంబర్3( విజయక్రాంతి): ఎల్ నినో పుణ్యమా(El Nino Causes) అని ఈ ఏడాది పశుగ్రాసానికి కొరత ఏర్పడేలా ఉంది. ప్రతి సంవత్సరం రైతులు పంటవేర్థాలను కాల్చి బూడిద చేసేవారు. అయితే ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులకు తోడు ఎల్ నినో ప్రభావం ఉండడంవల్ల రబి పంటలు సాగుకు నోచుకోవడం లేదు. గత ఏడాది బోత్ సునాల మండలాల్లో కలిపి 22000 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగయింది.

దీంతో పశుగ్రాసానికి కొరత లేకుండా పోయింది. అయితే ఈ ఏడాది ఖరీఫ్ సాగు కింద మొక్కజొన్న, సోయాబీన్ పంట వ్యర్థాలను కాల్చివేయకుండా రైతులు నిర్వహించుకుంటున్నారు. భవిష్యత్తులో పశువులకు మేత దొరక్కపోతే ఇబ్బందులు ఎదురవుతాయని ముందస్తుగాని రైతులు పంట వ్యర్థాలను నిలువ ఉంచుతున్నారు.

ముందు చూపు లేకపోతే పశువులకు ఇబ్బంది తప్పదు: రైతు రామ్ రెడ్డి. 

రైతులు పంట వ్యర్థాలను కాల్చి వేయకుండా జాగ్రత్త మరిచిపోవాలని సునాల మండలం రైతు నాయకులు రాంరెడ్డి కోరారు. ఈఏడాది పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉంటుందని రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సోయాబీన్ పంట వ్యర్థాలను కాల్చి వేయడం జరిగిందని కానీ ఈ సంవత్సరం అతిథ్యానికి మూడు వేల రూపాయలకు మ్యాక్స్ వాహనాలలో తీసుకువెళ్తున్నారు అన్నారు. మొదట రైతులు పంట వ్యర్థాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని అమ్మితే తిప్పలు తప్పదు అన్నారు.

మరిన్ని వార్తలు