జాతీయవాదుల సంగమం నకు తరలివెళ్లిన జగిత్యాల పూర్వ ఎ బి వి పి నాయకులు

03-11-2026 | 03:50pm

జగిత్యాల, నవంబర్ 03 ( విజయ క్రాంతి ) హైదరాబాదులో నిర్వహించనున్న జాతీయవాదుల సంగమం కార్యక్రమానికి (Nationalist Sangam program) జగిత్యాల పట్టణంలోని ఏబీవీపీ పూర్వ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ తరలి వెళ్లారు. ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఇటీవల కర్ణాటక రాష్ట్ర కో ఇన్చార్జిగా నియామకం అయిన సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఏబివీపీ పూర్వ కార్యకర్తలు, జాతీయ వాదులతో సమావేశాన్ని నిర్వహించారు.

హైదరాబాద్ వెళ్ళిన వారిలో పూర్వ ఏబీవీపీ నాయకులు ఏ సి ఎస్ రాజు, పుప్పాల సత్యనారాయణ, రాజ మనోహర్ రెడ్డి, మ్యాన మహేష్, బేజ్జంకి సంపూర్ణ చారి, బొనాగిరి దేవయ్య, అన్నల్దాస్ మురళీ,పిల్లి శ్రీనివాస్, గండ్ర ప్రసాద్ రావు, శివ ప్రసాద్, జున్ను రాజేందర్, సిరిసిల్ల వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు