కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

08-10-2026 | 07:48pm

నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 8 (విజయ క్రాంతి):రాహుల్ గాంధీని(Rahul Gandhi) ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఖండిస్తూ,రాహుల్ గాంధీని బేషరతుగా విడుదల చేయాలని,ఆయనపై ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని డిమాండ్ చేశారు.అలాగే సర్ ప్రక్రియ సక్రమంగా,పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ నాగిరెడ్డిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ(Congress Party) ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

అదేవిధంగా సర్ ప్రక్రియపై నెలకొన్న అనుమానాలు,ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా విచారణ జరిపి ప్రజలకు స్పష్టత కల్పించాలని,ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.అలాగే ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ...ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును గౌరవించాలని,ప్రజల ఓటు హక్కు మరియు ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.ఓటు హక్కును కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ  కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు ప్రభాకర్,సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి,జీవరత్నం, సాయ గౌడ్,గులాబ్ హుస్సేన్,శ్రీరామ్ గౌడ్, ఫారుక్,సురేందర్ గౌడ్, హనుమాన్లు,వెంకా గౌడ్, వాసురెడ్డి,బెస్త సాయిలు, హిమం,శ్రీనివాస్ రెడ్డి, సాయికుమార్,మన్నె వెంకటి,సుధాకర్,ప్రభు గౌడ్, వస్రం నాయక్,దివిటీ కిష్టయ్య,గోపాల్ గౌడ్, గంపల వెంకన్న,భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు