విద్యార్థులకు పోలీస్ స్టేషన్‌పై అవగాహన

30-10-2026 | 05:44pm

నిజాంసాగర్,(విజయక్రాంతి): విద్యార్థులకు(Students) పోలీస్ శాఖ విధులు, చట్టాలు, నేరాలపై అవగాహన కల్పించేందుకు కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండల పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం నాడు  ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజాంసాగర్ పాఠశాలకు చెందిన 8, 9వ తరగతి విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరుపై ఎస్సై శివకుమార్  వివరించారు.

ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది స్టేషన్ పరిసరాలను విద్యార్థులకు చూపిస్తూ పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, ప్రజలకు అందించే సేవలు, నేరాల నియంత్రణలో పోలీసుల పాత్ర గురించి  వివరించారు. చట్టాలు, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.

ముఖ్యంగా మైనర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదని, మోటారు వాహనాల చట్టం, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అవగాహన కల్పించారు. చిన్న వయస్సులోనే నేరాలకు పాల్పడితే భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పోలీస్ సిబ్బంది పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రక్షణ కాంత్ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు