ఒక్క జబ్బు.. కుటుంబం కుదేలు! నిర్మలమ్మ కామెంట్స్

23-11-2026 | 01:29pm

న్యూఢిల్లీ: ఒక్క అనారోగ్యం (Illness) వస్తే చాలు.. ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితి ఎదురవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదరికాన్ని కేవలం జీతాలు, ఆదాయంతోనే కొలవలేమని స్పష్టం చేశారు. కుటుంబాలకు అవసరమైన కనీస జీవన సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పుడే పేదరికం నుంచి పూర్తిగా బయటపడగలరని అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీలో మాట్లాడిన ఆమె.. పేదరికం (Poverty) అంటే కేవలం డబ్బు లేకపోవడం మాత్రమే కాదని వివరించారు. ప్రతి కుటుంబానికి సురక్షితమైన ఇల్లు, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలని అన్నారు. ఇవి లేకపోతే ఆదాయం పెరిగినా పేదరికం నుంచి పూర్తిగా బయటపడలేరని అభిప్రాయపడ్డారు.

భారత్‌లో 2011 నుంచి 2023 మధ్య దాదాపు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు (World Bank) తాజా నివేదికను ఉటంకిస్తూ నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో తీవ్ర పేదరికం గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఈ మార్పునకు కేవలం నగదు పంపిణీ మాత్రమే కాకుండా కుటుంబాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా ప్రధాన కారణమని వివరించారు.

ఒక్క అనారోగ్యం కుటుంబం దాచుకున్న పొదుపు మొత్తాన్ని ఖాళీ చేసి తిరిగి పేదరికంలోకి నెట్టేయగలదని నిర్మలమ్మ అన్నారు. అందుకే పేదరిక నిర్మూలన (Poverty Eradication) అంటే ఆదాయం పెంచడమే కాకుండా ప్రతి కుటుంబానికి మెరుగైన జీవన సదుపాయాలు, నాణ్యమైన వైద్యం అందించడం కూడా ముఖ్యమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు