100 కోట్ల క్లబ్‌లోకి.. ‘ఓం’

23-11-2026 | 01:39pm

ధనుష్-ముమ్ముట్టి(Dhanush Mammootty) ప్రధాన పాత్రల్లో నటించిన ఓం చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు వసూలు చేసినట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ‘O.M: Operation Mole’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.85.30 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనాలు వెల్లడిస్తున్నాయి.

భారతదేశంలో ఈ సినిమా రూ.50.25 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా, ఓవర్సీస్ మార్కెట్ నుంచి రూ.27 కోట్ల గ్రాస్ అందుకుంది. తొలి రోజు రూ.18.10 కోట్ల ఇండియా నెట్ వసూళ్లతో ప్రారంభమైన ఈ చిత్రం, ఆదివారం కూడా రూ.15.90 కోట్లను తన ఖాతాలో వేసుకుంది. తమిళ వెర్షన్ నుంచి అత్యధికంగా రూ.37.30 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి.

తెలుగు వెర్షన్ రూ.11.50 కోట్లతో ఆకట్టుకోగా, హిందీ వెర్షన్ రూ.1.45 కోట్లు సాధించింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధనుష్‌తో పాటు మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కీలక పాత్రల్లో నటించారు. నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు కూడా కనిపించారు. వీకెండ్‌లో మంచి వసూళ్లు సాధించిన ‘ఓం’కు ఇప్పుడు అసలైన పరీక్ష మొదలైంది. వారాంతం తర్వాత కూడా ఇదే జోరును కొనసాగించి రూ.100 కోట్ల మైలురాయిని అందుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు