ఎర్రకుంట చెరువు తండాలో రేషన్ కార్డుల పంపిణీ

21-09-2026 | 06:13pm

నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): మండలంలోని బెజ్గం చెరువు తండా గ్రామపంచాయతీ పరిధిలో గల ఎర్రకుంట తండాలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బెజ్గం చెరువు తండా గ్రామ సర్పంచ్ మలావత్ భాస్కర్ నాయక్(Sarpanch Malavath Bhaskar Naik) గ్రామ ప్రజలకు నూతన రేషన్ కార్డులు అందజేశారు.

మొత్తం గ్రామ పంచాయతీకి 100 నూతన రేషన్ కార్డులు మంజూరు కావడంతో వాటిని పంపిణీ చేసినట్లు సర్పంచ్ మలావత్ భాస్కర్ తెలిపారు. ప్రజా సేవే మా లక్ష్యం-ప్రజా అభివృద్ధి మా దేహం అంటూ పేర్కొన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు అయ్యేలా తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ మలావత్ భాస్కర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మలావత్ భాస్కర్ నాయక్, ఉప సర్పంచ్ పిక్ల నాయక్, జిపిఓ లక్ష్మణ్, పంచాయతీ సెక్రెటరీ రమేష్, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు