రాజ్యాంగ విరుద్ధంగా చైర్మన్,డైరెక్టర్ల నియామకాలు...
తాడ్వాయి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా సింగిల్ విండో చైర్మన్, డైరెక్ట్ ల పదవుల నియామకాలు నిర్వహిస్తుందని బిజెపి తాడ్వాయి మండల శాఖ అధ్యక్షులు వెలమ సంతోష్ రెడ్డి(Velama Santosh Reddy) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
సింగిల్ విండోలకు ఎన్నికలు నిర్వహించకుండా ఏకపక్ష నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులనే చైర్మన్, డైరెక్టర్లు గా నియమించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. డైరెక్టర్ పదవుల్లో సైతం ఎమ్మెల్యేకి ఇష్టం ఉన్న ఊరిలో ఎక్కువమందిని నియమించడం సిగ్గుచేటన్నారు. ఏ గ్రామంలో గతంలో ఎన్ని డైరెక్టర్ పదవులు ఉన్నాయో అదే విధంగా నియమించాలని లేకపోతే బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు రవి, జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.