రామేశ్వర్‌పల్లిలో ఇందిరమ్మ గృహనిర్మాణనికి భూమిపూజ

25-09-2026 | 03:51pm

భిక్కనూర్, సెప్టెంబర్‌ 25 (విజయ క్రాంతి): భిక్కనూర్‌ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో(Rameswarpalli Village) ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Housing Scheme) కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు.

గ్రామంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్‌ గొల్లపల్లి వినోద్‌గౌడ్‌, డీఎల్‌పీవో శ్రీనివాస్‌, ఎంపీడీవో సవితారెడ్డి, ఎంపీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిప్పాపూర్‌ భీంరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు, పంచాయతీ సెక్రటరీ శ్యామ్‌, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు