విలేకరిని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
కల్లూరు, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): కల్లూరు పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ దినపత్రిక విలేకరి గంగుల గోపిని(Reporter Gangula Gopi) శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress party leaders) పరామర్శించారు. ఇటీవల అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో కుడికాలికి శస్త్రచికిత్స చేయించుకున్న గోపి ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్కినేని కృష్ణ, కాటేపల్లి కిరణ్, పెద్దబోయిన శ్రీను, ఏనుగు సత్యంబాబు, పాపబత్తినీ నగేష్, బైర్ల కాంతారావు, తురాబల్లి, తోట సుబ్బారావు, ఆల్లకుంట నరసింహారావు, భరత్, కుంచాల వీరయ్య, పుల్లా చారి తదితరులు పాల్గొన్నారు.