పండిట్ దీన్‌దయాళ్ దేశానికే ఆదర్శం
బిజెపి మండల అధ్యక్షుడు క్రాంతి కుమార్
ముస్తాబాద్,సెప్టెంబర్ 25( విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో (BJP Party Office)మండల అధ్యక్షుడు సౌల్ల క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి వారి చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలిసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ.. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేసిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు.
ఒక వ్యక్తి, సంఘం,సమూహం వేరు వేరుగా కాకుండా మన ఆలోచన మన ఆశయం నిరంతరం దేశం కోసం ప్రజల అభివృద్ధి కోసం పాటు పడాలని మనమంతా ఒకే త్రాటి పై ఉండాలని “ఏకాత్మ మానవతావాదం “అంత్యోదయ” సిద్ధాంతాలను సమాజానికి అందించారని కొనియాడారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలన్న ఆయన ఆశయాలకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల, జనధన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన,స్వచ్ఛ భారత్, దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన వంటి పథకాల ద్వారా పేద, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఫలాలు అందేలా పనిచేయడమే దీన్‌దయాళ్ కు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్ రెడ్డి, అంజగౌడ్,గోపి,జిల్లెళ్ల మల్లేశం,నరేష్, కృష్ణ, సత్యం,వేణుగోపాల్, వినయ్,యాదగిరి,వినయ్, ప్రవీణ్,సత్యం తదితరులు పాల్గొన్నారు.