అధ్వానంగా మరుగుదొడ్లు...
ఆలనా పాలన లేని కార్యాలయాలు...
తాడ్వాయి,సెప్టెంబర్, 25( విజయక్రాంతి ): ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనాలు(Constructed buildings) ఆలనా పాలనా లేకుండా అధ్వానంగా మారుతున్నాయి. పట్టించుకునే వారు లేక అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. కామారెడ్డి జిల్లా(Kamareddy District) లో నిర్మించిన రైతు వేదిక భవనాలు(Farmer Platform Buildings) సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించకపోవడంతో అధ్వానంగా మారుతున్నాయి. తాడువాయి మండలంలోని కృష్ణాజివాడి, తాడువాయి, ఎర్రపహాడ్, కన్కల్, బ్రాహ్మణపల్లి గ్రామాలలోని ని రైతు వేదికలలో ఏర్పాటుచేసిన మరుగుదొడ్లు అద్వాన్నంగా మారుతున్నాయి వీటిని ఉపయోగించడానికి ఇబ్బందిగా తయారవుతున్నాయి.
కంపు కొడుతున్న మరుగుదొడ్లు...
రైతు వేదిక ఆవరణలో(Rythu Vedika Premises) వ్యవసాయ శాఖ అధికారులు, రైతులకు సౌకర్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరుగుదొడ్లు ఏర్పాటు చేసింది. కానీ ఆ మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి.వాటి వైపు వెళ్లాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. మరుగుదొడ్లు దూసు, చెత్తాచెదారం నిండిపోయి ఉంది. వీటిని వాడుకోవాలంటేనే రైతులు వెనుకడుగు వేస్తున్నారు
అద్వానంగా సింకు, ట్యాపులు...
మరుగుదొడ్ల(Toilets) పక్కనే ఏర్పాటుచేసిన సింకులు ట్యాపులు(Sinks and taps) అద్వానంగా మారాయి. అధికారులకు, రైతులకు సౌకర్యవంతంగా ఉంటుందనే లక్ష్యంతో సింకు లు, టాప్ లు ఏర్పాటు చేశారు. కానీ వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయి. కొన్ని రైతు భవనాలకు అసలు నీటి సరఫరానే లేదు. దీంతో మరుగుదొడ్లు, సింకుల ను ఉపయోగించడానికి వీలు లేకుండా పోయింది.
వంగిపోతున్న రేకులు...
రైతు భవనాలకు ఏర్పాటు చేసిన పైకప్పు రేకులు వంగిపోతున్నాయి. తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు భవనం పైకప్పు రేకులు వంగిపోవడంతో ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందోనని రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిర్మించిన అనతి కాలంలోనే రైతు భవనాలు అద్వాంగం మారడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు వేదికలకు ఏర్పాటుచేసిన డోర్లు సైతం విరిగిపోతున్నాయి. సదరు కాంట్రాక్టర్లు నాసిరకంగా నిర్మించడంతోనే రేకులు వంగిపోవడం, డోర్లు విరిగిపోవడం లాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
10 సంవత్సరాల కాలం పాటు మన్నికగా ఉండాల్సిన భవనాలు నిర్మించిన కొన్ని సంవత్సరాలకే అధ్వానంగా మారడం పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సదరు అధికారులు స్పందించి రైతు వేదిక భవనాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మరుగుదొడ్లు, సింకులను శుభ్రం చేయించాలని కోరుతున్నారు. శిథిలమైన డోర్లకు, రేకులకు మరమ్మతులు చేయించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.