బిజెపిలో యువనాయకత్వానికి ప్రోత్సాహం

25-09-2026 | 04:31pm

నిర్మల్ సెప్టెంబర్ 24 ( విజయ క్రాంతి): భారతీయ జనతా పార్టీలో(Bharatiya Janata Party) అనుబంధ సంఘాల్లో యువనాయకత్వానికి ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి (MLA Maheshwar Reddy)అన్నారు. సోన్ మండలం పాక్‌పట్ల గ్రామానికి చెందిన పొల్కం ఉదయ్ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఈ సందర్భంగా శుక్రవారం బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సత్యం చంద్రకాంత్, సోన్ మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, నాయకులు జుట్టు దినేష్, సాయిరెడ్డి, నర్సారెడ్డి, సన్నీ రెడ్డి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు