జుక్కల్ ఎంఈఓ కార్యాలయంలో ఆధార్ సెంటర్ ఏర్పాటు
జుక్కల్, సెప్టెంబర్ 13 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Government of Telangana State), విద్యాశాఖ ఆదేశానుసారం స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జుక్కల్ మండల కేంద్రంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో మంగళవారం ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని జుక్కల్ విద్యాశాఖ అధికారి తిరుపతయ్య తెలిపారు.
దసరా సెలవుల దృష్ట్యా విద్యాభ్యాసిస్తున్న చిన్నారులకు బయోమెట్రిక్ (ఎంబియు) ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో పాటు హైస్కూల్ విద్యార్థుల వరకు కూడా ఆధార్ నమోదు, పేర్ల తప్పులు, చిరునామా సరి చేయుట, ఇతరత్రా మార్పులు చేర్పుల కోసం ఎంఈఓ కార్యాలయంలోని ఆధార్ కేంద్రాన్ని ప్రారంభించామని అన్నారు. విద్యార్థులు ఎట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.