డిసెంబర్ 15 నుంచి ఆశాల నిరవధిక సమ్మె
అదనపు కలెక్టర్ కు సమ్మె నోటిస్ అందజేత
భూపాలపల్లి టౌన్, నవంబర్ 04 (విజయక్రాంతి): ఆశాలకు కనీస వేతనం 18 వేల రూపాయలు అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆశాలు(ASHA Workers) నిరవధిక సమ్మె చేయనున్నట్లు ఆశ యూనియన్ సీఐటీయు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కొండ లక్ష్మి, బీ ఆర్ టీ యు జిల్లా అధ్యక్షురా లు మైస రజిత తెలిపారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ విజయలక్ష్మికి బుధవారం సమ్మె నోటీసు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనగుణంగా వేతనాలు పెంచడం లేదని, పారితోషకం పేరుతో ఆశా కార్యకర్తల శ్రమను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం దేవేందర్ మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ఆశా కార్యకర్తలు ప్రాణాలు పణంగా పెట్టి ముందుండి పని చేశారని, ఆశా కార్యకర్తలకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ గ్లోబల్ లీడర్ గా గుర్తించిందని అన్నారు. ఆశాల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు నిరవధిక సమ్మెకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్పన, విజయ, రత్నకుమారి, మంజుల, రాధిక, సరూప శ్రీలత సునీత సుకన్య లతా సరిత, వసంత, ప్రమీల పాల్గొన్నారు.