అఖండ జ్యోతి దర్శనానికి భక్తులు తరలి రావాలి: ఈవో లక్ష్మీ ప్రసన్న
జనగామ,(విజయక్రాంతి): కార్తీక పౌర్ణమి(Karthika Purnima) సందర్భంగా పాలకుర్తి శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం(Palakurthi Sri Someswara Lakshmi Narasimha Swamy Temple)లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు అఖండ జ్యోతి, గిరి ప్రదక్షిణ, లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు. ఆలయ గుట్టపై భారీ ప్రమిదలో టన్ను నువ్వుల నూనె, ఆవు నెయ్యి, 2 క్వింటాళ్ల ముద్ద కర్పూరంతో జ్యోతి వెలిగిస్తామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమానికి పీఠాధిపతి శ్రీ స్వామి దుర్గానందపురి మహారాజ్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరవుతారని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని ఈవో కోరారు.