సింగరేణి కార్మికుడు రాజశేఖర్ దారుణ హతం

23-11-2026 | 11:05am

గోదావరిఖనిలో దారుణ హత్య 

ఫోన్ చేసి బయటకు పిలిచి కత్తులతో దాడి

 బలమైన గాయాలతో మృతి పవర్‌హౌస్ కాలనీ శివాలయం సమీపంలో ఘటన.. పోలీసుల దర్యాప్తు

గోదావరిఖని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖ(Godavarikhani)ని పట్టణంలో దారుణ హత్య కలకలం రేపింది. సింగరేణి(Singareni) సంస్థ జీడీకే-11 ఇంక్లైన్‌లో పనిచేస్తున్న కార్మికుడు రాజశేఖర్ హత్య(Singareni worker Rajasekhar murdered)కు గురయ్యాడు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. సప్తగిరి కాలనీకి చెందిన రాజశేఖర్‌కు ఫోన్ రావడంతో బయటకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో గోదావరిఖని పవర్‌హౌస్ కాలనీలోని శివాలయం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు ఏమిటి... ఈ దారుణానికి పాల్పడింది ఎవరు.. అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. సింగరేణి కార్మికుడి హత్యతో గోదావరిఖని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు