రేపు కోటగుళ్లలో కార్తీక దీపోత్సవం
పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
గణపురం,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం(Sri Bhavani Sahita Ganapeshwaralayam) కోటగుళ్లలో కార్తీక మాస ఉత్సవాల(Karthika Masam Utsavam)ను పురస్కరించుకొని రేపు మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో దీపోత్సవ(Deepotsavam) కార్యక్రమాన్ని కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
పౌర్ణమి పర్వదిన సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పట్టు వస్త్రాలతో అలంకరణతో పాటు ఉసిరి, మారేడు, నాగదేవుని పుట్ట వద్ద దీపాలు వెలిగించనున్నారు, కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ విజ్ఞప్తి చేసింది.