తిరుమల భక్తులకు అలర్ట్..
నేడు మూడు రకాల దర్శన టికెట్లు విడుదల
తిరుమల: శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ(Tirumala Tirupati Devasthanams) కీలక అప్డేట్ ఇచ్చింది. ఫిబ్రవరి 2027 నెలకు సంబంధించిన వివిధ దర్శన టికెట్ల(Darshan Tickets)ను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా నేడు (నవంబర్ 23) ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లను విడుదల చేయనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టోకెన్లు అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు రేపు (నవంబర్ 24) ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి వసతి గదుల కోటాను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. భక్తులు టికెట్ల కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ను మాత్రమే సందర్శించాలని అధికారులు సూచించారు. టికెట్ల కోటా పరిమితంగా ఉండటంతో బుకింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.