తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

23-11-2026 | 08:25am

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి(Tirumala Srivari Darshan) వచ్చే భక్తులకు కాస్త ఊరట లభిస్తోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు సుమారు 8 గంటల్లో దర్శనం లభించనుంది. మరోవైపు ఆదివారం శ్రీవారిని 81,516 మంది భక్తులు దర్శించుకున్నారు. మొక్కుల్లో భాగంగా 25,547 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారి హుండీకి రూ.3.81 కోట్ల ఆదాయం సమకూరింది. తిరుమలలో ప్రస్తుత రద్దీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ యాత్రను ముందుగా ప్రణాళిక చేసుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు