కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్ట్

23-11-2026 | 11:10am

కరీంనగర్ సిటీ,(విజయక్రాంతి): బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్(BJP National President Nitin Nabin)  కరీంనగర్ రాక సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తూ, నితిన్ నబిన్ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించిన కాంగ్రెస్ నేతల(Congress Leaders)ను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. రెస్ట్ అయిన వారిలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ సముద్రాల లక్ష్మణ్, డీసీసీ వైస్ చైర్మన్ రెడ్డి గాని రాజు, తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు ఏలుక రాజు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెసిడెంట్ అట్లా అనిల్ ఉన్నారు.

ఈ సందర్భంగా సముద్రాల లక్ష్మణ్ మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని మండిపడ్డారు. నరేంద్ర మోదీ గారు మరియు అమిత్ షా గారు భారత రాజ్యాంగం పట్ల, ఆ రాజ్యాంగాన్ని రాసిన బాబా సాహెబ్ అంబేద్కర్ వారసుల పట్ల అనుసరిస్తున్న తీరుకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

అంబేద్కర్ వారసులు ప్రతి ఒక్కరు 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసి భారత రాజ్యాంగాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని, ముందస్తు అరెస్టులతో గొంతు నొక్కాలని చూస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సముద్రాల లక్ష్మణ్ టీపీసీసీ జనరల్ సెక్రెటరీ, డిసిసి  వైస్ చైర్మన్ రెడ్డి మండల అధ్యక్షుడు ఎలుక రాజు నియోజకవర్గ ప్రెసిడెంట్ అట్లా అనిల్

మరిన్ని వార్తలు