రహదారి సమస్య పరిష్కరించాలని హైదరాబాద్ లో వినతి

06-11-2026 | 06:49pm

మల్లాపూర్, నవంబర్ 06 (విజయక్రాంతి): మండలంలోని మొగిలిపేట గ్రామంలో(Mogilipeta Village) కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు ఉన్న ప్రధాన రహదారి సమస్యను(Main road problem) పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు రాష్ట్ర సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkat Reddy) కార్యాలయ ఓఎస్డీ నరేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన రహదారి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

రహదారి సమస్య కారణంగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించి గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోల్కొండ కళ రమేష్, ఉపసర్పంచ్ రాజేందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జలపతి రెడ్డి, చిన్నయ్య, వర్ధ సురేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు