వర్షాలు కురవాలని స్వామిని వేడుకున్న మంత్రులు
ధర్మపురి,అక్టోబర్25(విజయక్రాంతి): ధర్మపురి(Dharmapuri Temple) లక్ష్మీ నరసింహ స్వామిని ఆదివారం తెల్లవారుజామున మంత్రులు పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు పుష్కలంగా పండాలని స్వామివారిని మంత్రులు వేడుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రార్థించారు. వర్షాలు కురిసి, పాడిపంటలు పుష్కలంగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మంత్రులు(Ministers) స్వామివారిని ప్రార్థించారు.
ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా కొనసాగాలని, ఎల్‌నినో ప్రభావం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు పరిశీలించారు.