కొమురం భీమ్ ఆశయ సాధన కోసం కృషి చేద్దాం

26-10-2026 | 06:20pm

మాజీ జడ్పీ చైర్మన్  రాథోడ్ జనార్ధన్

ఉట్నూర్, అక్టోబర్ 26( విజయక్రాంతి): "జల్ - జంగల్ - జమీన్"(Jal-Jangal-Zameen)పై పూర్తి అధికారం గిరిజనులకే ఇవ్వాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు(Job opportunities) చదువుకున్న గిరిజన నిరుద్యోగులకు కల్పించాలని, పేద గిరిజనులు కడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు కలిగించవద్దని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అన్నారు.

 సోమవారం ఉట్నూర్ పట్టణంలోని కేబీ కాంప్లెక్స్‌లో గిరిజన వీరుడు కొమురం భీమ్ 86వ వర్ధంతి(86th Death Anniversary of Komaram Bheem) సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, అభివృద్ధి పనులకు ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన చట్టాలు గిరిజనులకు ఉపయోగపడే విధంగా పకడ్బందీగా అమలు చేయాలని, కొమురం భీమ్ ఆశయాలు నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ వర్ధంతి సందర్భంగా అడ్వకేట్ బానోతు జగన్ నాయక్, పరిశ్రమల శాఖ రిటైర్డ్ జీఎం జాదవ్ రామకిషన్ నాయక్, ప్రజా సంఘాల నాయకులు భానోత్ రామారావు, నేతావత్ రాందాస్ నాయక్, పీఆర్టీయూ ఆసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లా అధ్యక్షులు ఆడే ప్రకాష్ మాట్లాడుతూ... "కొమురం భీమ్ ఏ ఆశయాల కోసం పోరాటం చేశారో, ఆ ఆశయాలు నెరవేరినప్పుడే, ఆయన ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే, వర్ధంతి సందర్భంగా నిజమైన నివాళులు అర్పించినట్లవుతుంది" అని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమంలో బండి విజయ్‌కుమార్, అడ్వకేట్ జాదవ్ రాజేష్, గోవింద్, సూర్యభాన్, కుమ్ర వినాయకరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు