కొమరం భీమ్‌కు ఘన నివాళి

26-10-2026 | 06:10pm

నిర్మల్ అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఆదివాసీ హక్కుల సాధన కోసం పోరాడిన గిరిజన పోరాట యోధుడు కొమరం భీమ్ 86వ వర్ధంతి(Komaram Bheem Death Anniversary)ని సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక చైన్ గేట్ సమీపంలోని కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం కొమరం భీమ్ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు భీమ్రావు తిరుపతి తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు