రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
జగిత్యాల, నవంబర్ 04 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణంలోని 38వ వార్డుకు చెందిన జరీనా బేగం మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయం స్థానిక కౌన్సిలర్ పిట్ట ధర్మరాజు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్(MLA Dr Sanjay Kumar) దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా జరీనా బేగం వైద్య చికిత్స నిమిత్తం రూ.2 లక్షల 50 వేల విలువైన ఎల్‌ఓసీని మంజూరు చేయించారు. మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే నివాసంలో జరీనా బేగం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పిట్ట ధర్మరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కూసరి అనిల్ తదితరులు పాల్గొన్నారు.