బీజే పీకి లాభమేనా!

27-09-2026 | 05:30am

4 చిన్న రాష్ట్రాలుగా యూపీ విభజన..

కేంద్రంలో స్థిరమైన మెజారిటీ సాధించాలనుకునే ఏ రాజకీయ పార్టీ అయినా ఉత్తరప్రదేశ్‌లో బలమైన ప్రదర్శన చేయాల్సిందే. రాష్ట్ర విస్తీర్ణం, జనాభా పరిమాణం, సమర్థవంతమైన పాలన, సమతుల్య అభివృద్ధి, ప్రాంతీయ అసమానతలకు వేగంగా స్పందించడం వంటి అంశాలే చాలాకాలంగా ఇక్కడ సవాలు విసురుతున్నాయనేది స్పష్టం. తూర్పు జిల్లాలు అధిక వలసలు, ఉపాధి కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటుండగా, బుందేల్‌ఖండ్ కరువు, వనరుల కొరతతో ఇబ్బందులు పడుతోంది. పశ్చిమ ప్రాంతాలు మరింత పారిశ్రామికీకరణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక కార్యకలాపాలతో ముందున్నాయి. ఇక లక్నో, కాన్పూర్ వంటి ప్రధాన పరిపాలనా, ఆర్థిక కేంద్రాలు మధ్య ప్రాంతంలో ఉన్నాయి.

  1. మంత్రి రాజ్‌భర్ వ్యాఖ్యలతో మళ్లీ చర్చ
  2. 27% ఓబీసీ రిజర్వేషన్లతో ముడిపెట్టిన రాజ్‌భర్
  3. సామాజికంగా కొత్త అవకాశాలు.. 
  4. 2027 ఎన్నికలకు ముందు రాజకీయ ప్రాధాన్యత

సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) అధినేత, ఉత్తరప్రదేశ్  రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్(State Minister Om Prakash Rajbhar) చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌ను నాలుగు చిన్న రాష్ట్రాలుగా విభ జించాలన్న అంశంపై రాజ్‌భర్ చేసిన వ్యాఖ్యలతో ఈ చర్చ మొదలయ్యింది. యూపీని పూర్వాంచల్, మధ్యాంచల్, బుందేల్‌ఖండ్, హరిత్ ప్రదేశ్ (హరిత ప్రదే శ్ అని కూడా పిలుస్తారు)గా విభజించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

దియోరియా, అంబేడ్కర్‌నగర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో మాట్లాడిన రాజ్‌భర్.. కులగణన పూర్తయిన తరువాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు ముందుకు వెళ్లవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రత్యేక పూర్వాంచల్ రాష్ర్టం ఏర్పడితే, తన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తొలి ముఖ్యమంత్రిగా ఉంటారని కూడా రాజ్‌భర్ పేర్కొనడం గమనార్హం. 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను సమానంగా పంపిణీ చేయాలన్న డిమాండ్‌తో ఈ ప్రతిపాదనను రాజ్‌భర్ ముడిపెట్టారు.

కులగణన పూర్తయితే ఓబీసీల ఉప వర్గీకరణతో పాటు రాష్ట్ర విభజనకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని ఆయన వాదించారు. రాష్ట్ర విభజన తప్పనిసరిగా జరిగే పరిణామంగా ఆయన చిత్రీకరించడంతో పాటు, భవిష్యత్ రాజకీయ పొత్తు ల్లో పూర్వాంచల్‌కు రాజ్‌భర్ వర్గానికి చెందిన ముఖ్యమంత్రి ఉండాలన్న అం శాన్ని ఒక షరతుగా ముందుకు తెచ్చారు.

అయితే, ఇలాంటి ప్రణాళికపై ప్రధానమంత్రి కార్యాలయంగానీ, భారతీయ జన తా పార్టీ జాతీయ నాయకత్వంగానీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచిగానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఎన్డీఏలో మరో భాగస్వా మ్య పార్టీ అయిన నిషాద్ పార్టీ అధినేత, మంత్రి సంజయ్ నిషాద్ మాట్లాడుతూ.. రాజ్‌భర్ వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని కొట్టిపారేశారు.

రాష్ర్టం అభివృద్ధి చెందుతోందని, బుందేల్‌ఖండ్, పూర్వాంచల్ వంటి ప్రాంతాలకు ఇప్పటికే ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సుమారు 24 కోట్ల జనాభాతో దేశంలోనే యూపీ అత్యధిక జనాభా కలిగిన రాష్ర్టంగా కొనసాగుతోంది. లోక్‌సభలో రాష్ట్రానికి 80 స్థానా లుండగా, రాష్ట్ర శాసనసభలో 403 స్థానా లు ఉన్నాయి. ఈ సంఖ్యలు జాతీయ రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్‌కు కీలకమైన రాజకీ య ప్రాధాన్యతను ఇస్తున్నాయి.

కేంద్రంలో స్థిరమైన మెజారిటీ సాధించాలనుకునే ఏ రాజకీయ పార్టీ అయినా ఉత్తరప్రదేశ్‌లో బలమైన ప్రదర్శన చేయాల్సిందే. రాష్ట్ర విస్తీర్ణం, జనాభా పరిమాణం, సమర్థవంతమైన పాలన, సమ తుల్య అభివృద్ధి, ప్రాంతీయ అసమానతలకు వేగంగా స్పందించడం వంటి అంశా లే చాలాకాలంగా ఇక్కడ సవాలు విసురుతున్నాయనేది స్పష్టం. తూర్పు జిల్లాలు అధిక వలసలు,

ఉపాధి కొరత వంటి సమస్యలను ఎదుర్కొంటుండగా, బుందేల్ ఖండ్ కరువు, వనరుల కొరతతో ఇబ్బందులు పడుతోంది. పశ్చిమ ప్రాం తాలు మరింత పారిశ్రామికీకరణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక కార్యకలాపాలతో ముందున్నాయి. ఇక లక్నో, కాన్పూర్ వంటి ప్రధాన పరిపాలనా, ఆర్థిక కేంద్రాలు మధ్య ప్రాంతంలో ఉన్నాయి.

ఈ ఆలోచన కొత్తది కాదు..

ఉత్తరప్రదేశ్‌ను చిన్న రాష్ట్రాలుగా విభజించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. 2011 నవంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో ఉత్తరప్రదేశ్‌ను పూర్వాంచల్, బుందే ల్‌ఖండ్, అవధ్ ప్రదేశ్, పశ్చిమ ప్రదేశ్‌లు గా విభజించాలంటూ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపినప్పటికీ, దానిపై తదుపరి చర్యలు తీసుకోలేదు.

ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దీనిపై అధికారిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేదు. చిన్న, మరింత సులభంగా పరిపాలనా నిర్వహించే యూనిట్ల అవసరంపై బీఆర్ అంబే ద్కర్ చేసిన సూచనలతో అనేక చర్చలు అప్పుడప్పుడు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఎన్నికలు సమీపించే సమయంలో ఈ డిమాండ్లు మళ్లీ రాజకీయ చర్చల్లోకి రావడం కనిపించింది. రాజ్‌భర్ కూడా గతంలో, ము ఖ్యంగా 2018లో, ఉత్తరప్రదేశ్ విభజన డిమాండ్‌ను లేవనెత్తారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం లేదా ప్రస్తుత రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం పార్లమెంట్‌కు ఉంది. అయితే దీనికి ముందుగా బిల్లు ప్రవేశపెట్టడం, రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని కోరడం, సరిహద్దులను ఖరారు చేయడం, రాజధానుల నిర్ణయం, ఆస్తులు- అప్పుల పంపకం, పరిపాలనా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ వంటి అనేక దశలు అవసరం. ప్రస్తుతం ఇలాంటి శాసన ప్రక్రియ ఏదీ ప్రారంభం కాలేదు.

విభజనకు సవాళ్లు..

అయితే కొత్త రాష్ట్రాల ఏర్పాటు అనేక సంక్లిష్ట సమస్యలను కూడా ముందుకు తెస్తుంది. వనరుల పంపకం, నీటి వాటాలు, ప్రభుత్వ ఉద్యోగులు, పరిపాలనా వ్యవస్థ, ఆస్తులు- అప్పుల పంపకం, ప్రాంతీయ గుర్తింపులు వంటి అంశాలపై విస్తృత చర్చలు, చర్చోపచర్చలు అవసరం అవుతాయి. గతంలో జరిగిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనుభవాలు చూస్తే, ఒకసారి విభజన ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మరిన్ని విభజన డిమాండ్లు లేదా ప్రత్యేక హోదా వంటి కొత్త డిమాండ్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే రాజ్‌భర్ వ్యాఖ్యలను విమర్శిస్తూ, ఎన్డీఏ ఎన్నికల సమయంలో ఒక మాట, మ రో సందర్భంలో మరో మాట మాట్లాడుతోందని ఆ రోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుల గణన, రిజర్వేషన్లపై చర్చలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే రాజకీయంగా పోటీని తీవ్రతరం చేస్తున్న సమయం లో రాజ్‌భర్ చేసిన వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ విభజ నపై చాలాకాలంగా ఉన్న వాదనను మరోసారి తెరపైకి తెచ్చాయి.

అయితే ఈ వ్యాఖ్యలు నిజమైన విధాన నిర్ణయానికి సంకేతమా, లేక రాజ్‌భర్ సామాజిక వర్గాన్ని రాజకీయంగా సమీకరించేందుకు చేసిన వ్యాఖ్యలా అనేదాంట్లో ప్రస్తుతానికి స్పష్టత లేదు. దీనిపై అధికారిక ధ్రువీకరణ లేకపోవడం ఈ అనిశ్చితిని కొన సాగిస్తోంది. 

ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పువచ్చు. భారత రాజకీయాల్లో ఉత్తరప్రదేశ్ పరిమాణం అనేది ఏకకాలంలో దాని బలంగా, మరోవంక సవాలుగా కూడా కనపడుతోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ దిశగా నిజమైన అడుగు పడాలంటే ఒక మంత్రి చేసిన ప్రకటనకంటే ఎంతో ఎక్కువ రాజకీయ సంకల్పం, సమగ్ర పరిపాలనా ప్రణాళిక, సుదీర్ఘ చర్చలు, పార్లమెంటరీ ప్రక్రియ అవసరం. అలాంటి చర్యలు ప్రారంభమయ్యే వరకు నాలుగు రాష్ట్రాల ప్రతిపాదన అనేది మరోసారి తెరపైకి వచ్చిన దీర్ఘకాలిక డిమాండ్‌గానే మిగిలిపోతుంది. దానిని ఆచరణలోకి తీసుకురావడానికి రా జ్యాంగ, పరిపాలనా, రాజకీయపరమైన అనేక సవాళ్లు ఇంకా ఉండనే ఉన్నాయి.

సామాజికంగా.. కొత్త అవకాశాలు..

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణతో నాయకత్వ సామాజిక కూర్పు కూడా మారే అవకాశం ఉందని విభజనకు అనుకూలంగా ఉన్నవారు చెబుతున్నారు. షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులు, యాదవులు, బ్రాహ్మణులు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులు నాలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఎదిగే అవకాశం ఉండవచ్చని వారు పేర్కొంటున్నారు. తద్వారా విభిన్న సామాజిక వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందని వాదిస్తున్నారు.

పూర్వాంచల్‌లో రాజ్‌భర్ సామాజిక వర్గానికి పలు జిల్లాల్లో గణనీయమైన జనాభా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక నాయకులకు మరింత ప్రాధాన్యత లభించే అవకాశం ఉండొచ్చు. అలాంటి పరిణామం ఒకే రాష్ట్ర స్థాయిలో ఒకే రాజకీయ శక్తి ఆధిపత్యం కంటే, అనేక ప్రాంతీయ రాజకీయ కేంద్రాలు ఏర్పడే పరిస్థితికి దారితీయవచ్చు. బీజేపీ, దాని మిత్రపక్షాల దష్టిలోనూ ఇటువంటి వ్యవస్థ వ్యూహాత్మకంగా మరింత సౌలభ్యాన్ని కల్పించవచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి.

ఒక భారీ రాష్ర్టంపై ఆధారపడటం కంటే నాలుగు చిన్న ప్రభుత్వాలతో పనిచేయడం పరిపాలనాపరంగా సులభంగా, రాజకీయంగా తక్కువ ప్రమాదకరంగా ఉండవచ్చని వాదిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ర్టంలో అధికార మార్పు జరిగినా, దాని ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంటుంది.

రాజకీయ సమీకరణాల్లో మార్పు..

ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించడం ప్రస్తుత రాజకీయ సమీకరణాలను గణనీ యంగా మార్చే పరిణామంగా చెప్పవచ్చు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో ఒక రాష్ట్ర స్థాయిలో ఒక నాయకుడు లేదా ఒక పార్టీకి కేంద్రీకృతంగా ఉం డే రాజకీయ ప్రభావం వికేంద్రీకృతం అవుతుంది. కొత్త రాష్ట్రాల్లో ఏదో ఒకదానిలో రాజకీయ అధికారం మారినా, దాని ప్రభావం మిగిలిన రాష్ట్రా లపై లేదా జాతీయ రాజకీయ సమీకరణాలపై ప రిమితంగా ఉండే అవకాశం ఉంటుందని విభజనకు అనుకూలంగా వాదించే వారు చెబుతున్నారు.

చిన్న రాష్ట్రాలను సులభంగా పరిపాలించవచ్చని, అభివద్ధి ప్రణాళికలను ప్రాంతీయ అవస రాలకు అనుగుణంగా రూపొందించవచ్చని, ప్ర జలకు ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గుతుందని ప్రతిపాదకులు పేర్కొంటున్నారు. ప్రాంతీయ స మస్యలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, కరువు ప్రభావిత ప్రాంతాలు, అధిక వలసలు ఉన్న ప్రాంతాలు, పారిశ్రామికంగా అభివద్ధి చెం దిన ప్రాంతాలకు ప్రత్యేక పథకాలను రూపొందించే అవకాశం ఉంటుందని వారు వాదిస్తున్నారు.

ఇలాంటి విభజన వల్ల యోగి ఆదిత్యనాథ్, అఖిలేశ్ యాదవ్ వంటి రాష్ట్ర స్థాయి నాయకుల రాజకీయ ప్రభావాన్ని, ప్రజలపై వారి ఆధిపత్యాన్ని కూడా పరిమితం చేయవచ్చన్న వాదన ఉంది. ఒకవేళ నాలుగు రాష్ట్రాల్లో ఒకటి లేదా రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోయి నా, దాని ప్రభావం దేశంలోని ఇతర రాష్ట్రాల ఎన్నికలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్నది ఈ వాదనలోని మరో అంశం. ఈ కోణంలో చూ స్తే.. యూపీ విభజన బీజేపీకి వ్యూహాత్మకంగా అనుకూలంగా మారవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల వేళ రాజకీయ ప్రాధాన్యత.. 

రాజ్‌భర్ చేసిన ఈ వ్యాఖ్యలు వెలువడిన సమయం కూడా రాజకీయంగా ప్రాధాన్యత కలిగినదే. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2027 ప్రా రంభంలో జరగాల్సి ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 33 స్థానాలకు పరిమితమవగా, సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానా లు గెలుచుకుంది. 2014, 2019 ఎన్నికల్లో కనిపించిన బీజేపీ ఆధిక్యతతో పోలిస్తే ఇది గణనీ యమైన మార్పు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర నాయకత్వం మధ్య విధానపరమైన భేదాలు ఉన్నాయంటూ రాజకీయ వర్గాల్లో అప్పుడప్పుడు చర్చలు జరిగినప్పటికీ, ఇరు వర్గా లు తీవ్రమైన విభేదాలున్నాయన్న వాదనలను బహిరంగంగా తోసిపుచ్చాయి. 2027లో అఖిలేశ్ యాదవ్ నేతత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ బలమైన ప్రదర్శన కనబరిస్తే.. అది రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌కు ఉన్న భారీ లోక్‌సభ ప్రాతినిధ్యం కారణంగా దాని ప్రభావం జాతీయ రాజకీయాలపైనా ఉండొచ్చు.

సి. ఎల్ . రాజం 

మరిన్ని వార్తలు