పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం
ఇల్లెందు టౌన్, నవంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణ పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం(Telangana Panchayat Raj Employees' Association) రాష్ట్ర ఉపాధ్యక్షులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మల్లవరపు రాజేష్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యుల ఆమోదంతో ఆయనకు రాష్ట్రస్థాయి బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం రాజేష్ చేస్తున్న కృషిని గుర్తించిన రాష్ట్ర సంఘం ఆయనకు ఈ అవకాశం కల్పించింది.
ముఖ్యంగా గత ఏడాది కాలంలో నిర్వహించిన పదోన్నతుల ప్రక్రియలో ఉద్యోగులకు అందించిన సహకారంతో పాటు, రాష్ట్ర సంఘం చేపట్టిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ఆయన ఎంపికకు దోహదపడింది. జిల్లా స్థాయిలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న రాజేష్‌కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల జిల్లా ఉద్యోగ వర్గాలు, ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
నూతన బాధ్యతల్లోనూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి మరింత అంకితభావంతో కృషి చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, రాష్ట్ర మండలి సభ్యులు, జిల్లా సంఘ బాధ్యులు, సభ్యులు ఆకాంక్షించారు.