మహిళా సంఘ భవనానికి భూమిపూజ
రూ.10 లక్షలతో నిర్మాణం.. స్థలదాతలకు ఎంపీడీవో అభినందనలు
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని బుడ్డగూడెం గ్రామంలో మహిళా సంఘ భవన(Women's Association Building) నిర్మాణానికి ఎంపీడీవో జమలారెడ్డి భూమిపూజ చేశారు. వి-బిజీ-రామ్-జి నిధుల ద్వారా రూ.10 లక్షల అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. నిర్మాణం పూర్తయితే మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాలు, పొదుపులు, రుణాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సౌకర్యంగా ఉంటుందన్నారు.
భవన నిర్మాణానికి స్థలం అందించిన సోడే ఖుసిందా, తోలయ్యను అభినందించారు.అనంతరం గ్రామంలో సోడే ఉమాదేవి ఫారం ఫండ్ పథకం అమలు తీరును పరిశీలించారు. చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటి లక్ష్మి,పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు,సోంపల్లి గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.