మునుగోడులో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పరిశీలన

27-10-2026 | 08:01pm

- పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా పరిశీలకురాలు దేవసేన

మునుగోడు, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఓటరు జాబితా సవరణ ప్రక్రియను జిల్లా పరిశీలకురాలు, కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన(District Observer Devasena) మంగళవారం మునుగోడు మండల కేంద్రంలో పరిశీలించారు. మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 171వ పోలింగ్‌ కేంద్రాన్ని ఆమె సందర్శించి, అక్కడ చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ(ఎస్‌ఐఆర్‌) తీరును సమీక్షించారు.

ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చేపడుతున్న పనులను పరిశీలించారు. ఓటరు జాబితా సవరణకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, ప్రక్రియకు సంబంధించిన వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించడం, సంబంధిత రికార్డులను సక్రమంగా నిర్వహించడం వంటి అంశాలపై ఈ పరిశీలనకు ప్రాధాన్యం ఏర్పడింది.

మరిన్ని వార్తలు