వైట్ ప్లేట్ వాహనాలతో టాక్సీ డ్రైవర్లకు నష్టం

27-10-2026 | 08:09pm

జీఎంఆర్ టాక్సీ అసోసియేషన్

పటాన్‌చెరు, అక్టోబరు 27: బ్లాబ్లా యాప్‌ ద్వారా వైట్ ప్లేట్ ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణికులను తరలించడంపై జీఎంఆర్ టాక్సీ అసోసియేషన్(GMR Taxi Association) సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నులు, ఇతర ప్రభుత్వ రుసుములు చెల్లిస్తూ టాక్సీలు నడుపుతున్న తమకు ప్రైవేట్ వాహనాల వల్ల బుకింగ్‌లు తగ్గి ఆదాయం పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

టాక్సీ డ్రైవర్లు ఏటా సుమారు రూ.లక్ష వరకు పన్నులు, ఇతర ఖర్చులు భరిస్తున్నామని తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి వచ్చే వైట్ ప్లేట్ వాహనాలు తక్కువ ధరలకు ప్రయాణికులను తరలిస్తున్నాయని ఆరోపించారు.

తెలంగాణ రవాణా మంత్రి స్పందించి, ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ దస్తగిరి, లింగంపల్లి టాక్సీ యూనియన్ అధ్యక్షుడు తాజుద్దీన్, వైస్ ప్రెసిడెంట్ జి. అశోక్, అడ్వైజర్ శ్రీనివాస్, బేతయ్య, ఫయాజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు