విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి
27-10-2026 | 08:11pm
నంగునూరు, అక్టోబర్ 27: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ, ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని మండల ప్రత్యేక అధికారి శివరంజని కోరారు. మంగళవారం నంగునూరులో మండల విద్యాధికారి తగిరెడ్డి దేశితో కలిసి ఆమె ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రెండో విడత పాఠ్యపుస్తకాలను(Textbooks) పంపిణీ చేశారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని శివరంజని ఆకాంక్షించారు.