యూఏఈ ప్రాపర్టీ గ్రాండ్ ఎక్స్ పో 2026

27-10-2026 | 08:07pm

హైదరాబాద్: యూఏఈ ప్రాపర్టీ గ్రాండ్ ఎక్స్ పో 2026(UAE Property Grand Expo 2026) అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనుంది. యూఏఈకి చెందిన గ్లోబల్డ్ ఎడ్జ్ అడ్వర్టైజ్ మెంట్ ఎల్ఎల్ సీ  ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్, అజ్మాన్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఈ ప్రదర్శనకు మద్దతు ఇస్తున్నాయి. ఈ రెండు రోజుల కార్యక్రమంలో యూఏఈలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ప్రభుత్వ ప్రతినిధులు, రంగ నిపుణులు పాల్గొంటారు.

భారతీయ పెట్టుబడిదారులు యూఏఈలో అందుబాటులో ఉన్న ఆస్తి అవకాశాల గురించి నేరుగా తెలుసుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది. నిర్వాహకులు తెలిపిన అంచనాల ప్రకారం, దుబాయ్ ఆస్తి పెట్టుబడి మార్కెట్‌లో భారతీయుల వాటా సుమారు 20–22 శాతంగా ఉంది. వార్షిక పెట్టుబడులు AED 30 బిలియన్లను మించుతున్నట్లు అంచనా. 2026 తొలి ఆరు నెలల్లో దుబాయ్‌లో ఆస్తుల విక్రయాలు AED 286 బిలియన్లకు పైగా నమోదయ్యాయి.

బలమైన సాంకేతిక రంగం, అభివృద్ధి చెందుతున్న వ్యాపార వాతావరణం, అధిక ఆదాయం కలిగిన పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతుండటంతో హైదరాబాద్ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు కీలక కేంద్రంగా ఎదుగుతోంది. 

దుబాయ్, అజ్మాన్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ల మద్దతు ఈ ఎక్స్‌పోకు సంస్థాగత విశ్వసనీయతను అందిస్తుంది. యూఏఈలోని ప్రీమియం నివాస ప్రాజెక్టులు, విలాసవంతమైన ఆస్తులు, అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి ప్రాంతాలను ఇక్కడ పరిచయం చేయనున్నారు. సందర్శకులు డెవలపర్లతో నేరుగా మాట్లాడి ఆస్తి యాజమాన్య నిబంధనలు, పెట్టుబడిదారుల రక్షణ, ఫైనాన్సింగ్ మార్గాలు, అద్దె ఆదాయ అవకాశాలు, అర్హత కలిగిన పెట్టుబడిదారులకు వర్తించే గోల్డెన్ వీసా మార్గాలపై సమాచారం పొందవచ్చు. ఇండియా-యూఏఈ రియల్ ఎస్టేట్ ఫోరంలో ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమ నిపుణులు పెట్టుబడి అవకాశాలు, నియంత్రణల్లో పారదర్శకత, యూఏఈ ఆస్తి మార్కెట్‌లో వస్తున్న మార్పులపై చర్చించనున్నారు. 

2010లో స్థాపించబడినగ్లోబల్డ్ ఎడ్జ్ అడ్వర్టైజ్ మెంట్ ఎల్ఎల్ సీ, యూఏఈ ప్రకటనలు మరియు మార్కెటింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది. 15 సంవత్సరాలకు పైగా అనుభవం, విస్తృత ప్రాంతీయ నెట్‌వర్క్, వ్యూహాత్మక మీడియా నైపుణ్యంతో వ్యాపారాలను సరైన ప్రేక్షకులతో అనుసంధానిస్తూ కొత్త వాణిజ్య అవకాశాలను అభివృద్ధి చేయడంలో సహకరిస్తోంది. గ్లోబల్డ్ ఎడ్జ్ అడ్వర్టైజ్ మెంట్ ఎల్ఎల్ సీ సిఈవో రఘు మాట్లాడుతూ: “హైదరాబాద్ సాంకేతిక రంగానికే కాకుండా, అంతర్జాతీయ పెట్టుబడులపై ఆసక్తి కలిగిన వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు కూడా ముఖ్యమైన కేంద్రంగా ఎదుగుతోంది.

యూఏఈ ప్రాపర్టీ గ్రాండ్ ఎక్స్ పో ద్వారా ఈ పెట్టుబడిదారులకు యూఏఈ రియల్ ఎస్టేట్ రంగంలోని అవకాశాలను మరింత చేరువ చేయాలనుకుంటున్నాం. “గత 15 సంవత్సరాలకు పైగా గ్లోబల్ ఎడ్జ్ వ్యాపారాలు, మార్కెట్ల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తోంది. దుబాయ్ మరియు అజ్మాన్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ల మద్దతుతో డెవలపర్లు, పెట్టుబడిదారులు కలుసుకునే విశ్వసనీయ వేదికను రూపొందిస్తున్నాం. ఈ కార్యక్రమం పెట్టుబడులను ప్రోత్సహించి, భారత్–యూఏఈ వ్యాపార సంబంధాలను బలోపేతం చేసి,యూఏఈ ఆస్తి మార్కెట్‌కు ప్రవేశ ద్వారంగా హైదరాబాద్ స్థానాన్ని మరింత పెంచుతుందని ఆశిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు