క్రీడాకారులకు సైకిళ్ల పంపిణీ చేసిన కమిషనర్ కే.సుజాత

12-09-2026 | 06:05pm

పాల్వంచ (విజయక్రాంతి): పాల్వంచ, శ్రీనివాస కాలనీలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్‌(Sports Authority Ground)లో అథ్లెటిక్స్‌ లో శిక్షణ పొందుతున్న గిరిజన క్రీడాకారిణులకు  వాకర్స్ క్లబ్ సభ్యులు  కాల్వ ప్రకాష్, కట్ట వెంకటనారాయణ,  సంజీవరావు , రామ్మూర్తి, రెహమాన్  సహకారంతో బహూకరించిన  సైకిళ్లను కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కే. సుజాత శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించి మంచి ఉద్యోగాలు  సంపాదించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు సైకిళ్లు అందజేసిన దాతలకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో తమ వంతు సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం  ఉందన్నారు.

ఈ సందర్భంగా వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు  కాల్వ ప్రకాష్ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా క్రీడాకారులు దూర ప్రాంతాల నుంచి గ్రౌండ్‌కు నడిచి వచ్చి అథ్లెటిక్స్‌ ప్రాక్టీస్ చేస్తున్న విషయాన్ని గమనించి, తమ మిత్రులతో కలిసి వారికి సైకిళ్లు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ సభ్యులు కనగాల అనంతరాములు, చావా రవి, ఆర్‌ఎంపీ  డి. కృష్ణాఅర్జున్ రావు,  రాణి, ఎలక రామస్వామి,పీడీ సునీత , జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కే. మహిధర్, అథ్లెటిక్స్ కోచ్ పి. నాగేందర్  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు