దండారి పండుగ గిరిజన ఐక్యతకు వేదిక
ఎస్పీ అఖిల్ మహాజన్
బోథ్. నవంబర్ 6 ( విజయక్రాంతి) : దండారి పండుగ(Dandari Festival) ఆదివాసీల ఐక్యతకు(Adivasi unity) నిదర్శనమని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్(Adilabad SP Akhil Mahajan) పేర్కొన్నారు. శుక్రవారం సోనాల మండలంలోని(Sonala mandal) పార్టీ బి గ్రామంలో నిర్వహించిన గుస్సాడీ ఉత్సవాలకు ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డితో(Adilabad DSP Jeevan Reddy) కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న ఆదివాసుల ఆచార వ్యవహారాలను మరిచిపోకుండా భావితరాలకు అందించాలన్నారు.
బండారి వేడుక ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆదివాసి సంస్కృతికి ప్రత్యేక స్థానం ఉందని వీరి సాంప్రదాయం ఆదర్శ మన్నారు. ఐక్యలతో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. పండుగలను సాంప్రదాయపద్ధంగా శాంతితో వాతావరణంలో సంతోషాల మధ్య జరుపుకోవాలని కోరారు.