సీసీఐ బకాయిలు వెంటనే చెల్లించేలా ఆదేశాలు ఇవ్వండి..
* జిల్లా కలెక్టర్‌ను కోరిన మున్సిపల్ కౌన్సిలర్లు...
ఆదిలాబాద్, అక్టోబర్ 06, (విజయక్రాంతి): సీసీఐ ఫ్యాక్టరీ డిస్మెంటల్ అయిన నేపథ్యంలో మున్సిపాలిటీకి చెల్లించాల్సిన రూ.4.44 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah)ను మున్సిపల్ కౌన్సిలర్ లు కోరారు. మంగళవారం కలెక్టర్ ను బీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లు కలిసి వినతిపత్రం అందజేశారు.
దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సీసీఐ బకాయిల విషయమై గతంలో పలుమార్లు ఢిల్లీ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సీసీఐ మేనేజర్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ సీసీఐ అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై మరోసారి ఢిల్లీ స్థాయి అధికారులతో మాట్లాడి బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రోహిత్‌తో పాటు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, పర్వేజ్ మహబూబ్, నాక్సన్, కిషోర్ సలీం, రషీద్, రిజ్వాన్, బబ్లు అన్నపూర్ణ. పాల్గొన్నారు.