ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలి

06-10-2026 | 04:36pm

బోథ్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్లను(Indiraamma houses ) ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను  నిర్మించుకోవాలని బోత్ ఎంపీడీవో ఎల్. రమేష్(Boath MPDO L. Ramesh) పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ధన్నూర్ కుచిలాపూర్ గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయాగ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం రెండవ విడత ఇళ్ళ మంజూరికి సిద్ధంగా ఉందన్నారు.

అయితే లబ్ధిదారులు సత్వరమే ఇండ్లనుపూర్తి చేయాలని కోరారు. అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు అవుతాయని ఈ విషయంలో ఆందోళన చెందవద్దన్నారు. గుడిసె వాసులందరికీ ఇళ్లను ప్రభుత్వ పరంగా మంజూరు చేస్తామన్నారు. గ్రామ సర్పంచ్ల ఆధ్వర్యంలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు రోహిణి రెడ్డి, నారాయణ ,కార్యదర్శులు అశోక్ కుమార్, శిరీష,లు ఉన్నారు.

మరిన్ని వార్తలు