ఆసాంఘిక కార్యకలాపాలను రూపుమపాలి..
తాంసి/భీంపూర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): భీంపూర్ మండలం మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్నందున ఆసాంఘిక కార్యకలాపాలు,అక్రమ రవాణా జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) ఆదేశించారు. మంగళవారం భీంపూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా పరిశీలించారు. పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న కలప,వాహనాల ప్రస్తుత స్థితిగతులను, నిర్వహణ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయంత్రం సమయాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. మండలంలో గంజాయి, గుడుంబా, దేశిదారు, లాంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండే విధంగా ప్రజలకు ప్రోత్సహించాలని తెలిపారు..పెన్ గంగా నుండి ఇసుక కొల్లగొడితే ఉక్కుపాదం మోపాలని అన్నారు..నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ఉండాలని ప్రజలు సన్మార్గం వైపు వెళ్లేలా ప్రయత్నించాలని తెలిపారు. సిబ్బంది వీధుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని విధులలో క్రమశిక్షణ సమయపాలన తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.
నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉండాలని, నేరం చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కోర్టుల నందు శిక్షలు పడే విధంగా చార్జి షీటును దాఖలు చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితుల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించాలని వారి సమస్యలను త్వరితగతిగిన పరిష్కరించి న్యాయం చేసిన సందర్భంలో పోలీసుల పట్ల గౌరవం నమ్మకం మరింత పెరుగుతుందని సూచించారు.
అసాంఘిక కార్యకలాపాలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రజలకు ఎలాంటి సమాచారం ఉన్న నిర్భయంగా 8712659973 నెంబర్ కి వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చు, ఈ వాట్సాప్ నంబర్ జిల్లా ఎస్పీ చే నిర్వహించబడుతుందనీ, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి,జైనథ్ సీఐ జి.శ్రావణ్,భీంపూర్ ఎస్ఐ పీర్ సింగ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.