దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి..
*ఐటీడీఏ ఉట్నూర్ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి జాదవ్ వసంత్ రావు..
ఉట్నూర్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ఏ పి ఓ జాదవ్ వసంత్ రావు(ITDA Utnoor APO Jadhav Vasanth Rao) అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నార్నూర్ మండలం వేంపల్లి గ్రామానికి చెందిన బాపూరావు తనకి ఏడ్ల జత మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు.నిర్మల్ మండలం నిర్మల్ గ్రామానికి చెందిన స్వాతి తనకు ఫార్మసిస్ట్ ఉద్యోగం ఇప్పించమని కోరారు. ఉట్నూర్ మండలం చండూరి గ్రామానికి చెందిన ధనరాజు తన కు ఏదైనా ఉద్యోగం మంజూరు కల్పించామని విజ్ఞప్తి చేశారు.గాదిగూడ మండలం రాముగూడ గ్రామానికి చెందిన మాడవి రాజు తనకు ఆటో మంజూరు కొరకు దరఖాస్తు అందజేశారు. సిర్పూర్ యు మండలం కోహినూర్ గ్రామానికి చెందిన విజయలక్ష్మి తమ గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం మరియు నీటి సౌకర్యం కలిపించండి అని కోరారు.
అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు. ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి జాదవ్ వసంత్ రావ్ తెలిపారు .