అన్నపూర్ణ తెలంగాణలో రైతులు హరిగోస పడుతున్నారు
మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
యాదగిరిగుట్ట, నవంబర్ 12 (విజయక్రాంతి): కెసిఆర్ ప్రభుత్వంలో(KCR Government) పాడిపంటలతో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా ఉండేదని అన్నపూర్ణ తెలంగాణ గా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని కాంగ్రెస్ ప్రజా పాలనలో రైతులు హరిగోస పడుతున్నారని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు.
గురువారం మాజీ ప్రభుత్వ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు పండించిన ధాన్యాన్ని తప్పనిసరిగా ఐకేపీ సెంటర్ ద్వారా గానీ, పి ఎ సి ఎస్ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేయాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు కార్యాచరణ, ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కళ్ళు తెరిచి ఎక్కడికి అక్కడ వరి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు తప్పకుండా ఒక హెల్ప్ లైన్ నెంబర్ ను డిస్ప్లే చేయండి తద్వారా రైతులకు ఏమైనా ఇబ్బంది ఉంటే మీకు సమాచారం ఇవ్వగానే మీరు వెంటనే స్పందించి అక్కడ ఉన్న ఇబ్బందులను తీర్చే విధంగా చర్యలు చేపట్టేందుకు వీలుగా ఉంటుందన్నారు.
అక్టోబర్ 3వ వారంలోనే వడ్ల కొనుగోలు ప్రారంభం జరగాలి కానీ ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో కొనుగోలు ప్రారంభం కాకపోవడం విచారకరం.ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా ఇంకా కొనుగోలు కేంద్రాలు రిబ్బన్ కట్టింగులకే ఉపయోగపడుతున్నాయే తప్ప వడ్ల కొనుగోలు ఏమాత్రం ప్రారంభం కావట్లేదు,త్వరగా వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు.