పిఆర్సి వెంటనే ప్రకటించాలి

12-11-2026 | 08:31pm

టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు డిమాండ్

జగిత్యాల, నవంబర్ 12 ( విజయ క్రాంతి): పియర్సి వెంటనే ప్రకటించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షడు(TSUTF District President) తిరుకోవెల శ్యామ్ సుందర్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల రూరల్ మండలంలోని ఆయా పాఠశాలల్లో టీఎస్ యుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఆర్సి కాలపరిమితి మూసినందున నివేదిక వెంటనే తెప్పించుకొని అమలు చేయాలన్నారు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయడంతో పాటు, బదిలీలు ప్రమోషన్లు చేపట్టి పాఠశాల విద్యను బలోపెతం చేయాలనీ కోరారు. ఆదర్శ పాఠశాలలను 317 జీఓ ను అమలు చేయడంతో పాటు 010 ద్వారా వేతనాలు ఇవ్వాలని పేర్కొన్నారు.

కస్తూర్బా పాఠశాల ఉపాధ్యాయులకు సర్వ శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి ఒజ్జ శ్రీనివాస్, మండల  ప్రధాన కార్యదర్శి తిరునగరి ప్రభాకర్, తేలు చిరంజీవి తదితరులు పాల్గొన్నరు.

మరిన్ని వార్తలు